పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,548 పోస్టుల భర్తీకి డీజీపీ జేవీ రాముడు విజయవాడలో నోటిఫికేషన్ ప్రకటించారు.
ఈ ప్రకటన ద్వారా
3,216 సివిల్ కానిస్టేబుల్,
1,067 ఆర్మ్‌డ్ రిజర్వుడు కానిస్టేబుల్,
జైళ్లలో 240 పురుష వార్డర్, 25 మహిళా వార్డర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ఉద్యోగాల్లో మూడో వంతు మహిళలకే కేటాయించినట్లు డీజీపీ తెలిపారు.
ఉద్యోగాల భర్తీలో భాగంగా ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ఆంధ్రప్రదేశ్ స్టే లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించినట్లు డీజీపీ తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్లోనే జరుగుతుందన్నారు. అక్టోబర్ 16న పోలీసు ఉద్యోగాల ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తామన్నారు.
For Complete details and Official Notification please visit http://recruitment.appolice.gov.in/jobs.php?job
No comments:
Post a Comment